/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-24-at-9.07.10-PM-jpeg.webp)
National Film Awards 2023: ఒకరిది సాహిత్యం.. మరొకరిది సంగీతం. ఈ రెండు రంగాల్లో వారు మేరు పర్వతాలు. ఒకే ఏడాదిలో అటు ఆస్కార్.. ఇటు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకుని.. తెలుగు వాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. వారే సినీగేయ రచయిత చంద్రబోస్.. స్వర మాంత్రికుడు ఎంఎం కీరవాణి. చంద్రబోస్ సాహిత్యం, కీరవాణి సంగీతం అందించిన నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు గెలుకుంది. మొట్టమొదటి సారి ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
అడవి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కొండపొలం సినిమాలోని ధమ్ ధమా ధమ్ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్‌ను జాతీయ అవార్డు వరించింది. 1995లో తాజ్‌మహల్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు చంద్రబోస్. తొలి చిత్రంలోనే చంద్రబోస్ సాహిత్యానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని అన్నీ పాటలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. అలాగే.. దర్శకుడు కే రాఘవేంద్రరావు రూపొందించిన పెళ్లి సందడి కూడా లిరికల్ హిట్ సొంతం చేసుకుంది. విషాదం, విరహం, ప్రేమ.. ఇలా సందర్భం ఏదైనా.. తన కలం నుంచి జాలువారే పదాలు.. ప్రేక్షకుల మదిలో పదిలంగా ఉండిపోతాయంటే అతిశయోక్తి కాదు. చంద్రబోస్ కేవలం గేయ రచయిత మాత్రమే కాదు.. నేపథ్య గాయకుడు కూడా.
ఒకే ఏడాది రెండు టాప్ అవార్డులు:
బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కేటగిరిలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి జాతీయ అవార్డు లభించింది. అటు ఆస్కార్.. ఇటు జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్న తొలి తెలుగు సినీ కళాకారులుగా సరికొత్త చరిత్ర సృష్టించారు చంద్రబోస్, కీరవాణి. ఇక 'నాటు నాటు' పాట ఎప్పుడు రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి అది ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది, మాస్ పదం కావడంతో అది అందరి మనసుల్లోకి ఈజీగా వెళ్లిపోయింది. అమెరికా, యూరప్ దేశాల్లో స్క్రీనింగ్‌లన్నింటిలో ఈ పాట ప్రేక్షకులను అలరించింది. అందరిని డ్యాన్స్ చేసేలా చేసింది. పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి వివిధ దేశాల్లోని థియేటర్‌లో ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించేవి. ఈ పాట అంతలా అందరి మనసుల్లో తిష్టవేసుకోవడానికి ప్రధాన కారణం కీరవాణి, చంద్రబోస్. ఇప్పుడా ఇద్దరికి ఒకే ఏడాదిలో రెండు బెస్ట్ అవార్డులు లభించాయి. ఒకటి ప్రపంచవ్యాప్తంగా టాప్ సినీ అవార్డు అవ్వగా.. మరొకటి ఇండియా వ్యాప్తంగా బెస్ట్ అవార్డ్!
Hearty Congratulations to #ChandraBose Garu for winning the Best Lyricist Award at #69thNationalFilmAwards for the film #Kondapolam 👏#VaishnavTej#RakulPreet#KirshJagarlamudi#NationalFilmAwards2023#MangoVideospic.twitter.com/5PDLZer1M6
— Mango Videos (@mangovideos) August 24, 2023
 Follow Us
 Follow Us