/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/tdp-3-jpg.webp)
MLC Vepada Chiranjeevi Rao: ఇంకో మూడు వారాల్లో ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తున్న సమయంలో డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులు మోసం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేశారని విమర్శించారు. నిరుద్యోగలను మోసం చేసే రీతిలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు. 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..టీచర్ పోస్టులు అయితే 23 వేలు పైగా ఖాళీగా ఉన్నాయని..కానీ, కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా టీచరు పోస్టులు ఏమయ్యాయని నిలదీశారు.
Also Read: చేవెళ్ల ఎంపీపై ఉత్కంఠ.. బయటివారు మాకొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి..!
117 జీఓ తీసుకురావడం వల్ల తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా రద్దు చేశారని..ప్రాధమిక పాఠశాలలను హై స్కూల్ లో విలీనం చేసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా రద్దు చేశారని కామెంట్స్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అప్రంటీస్ షిప్ తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు రంగంలో ఏఈ, ఏ ఈ ఈ పోస్టులు 1230 వరకూ వున్నాయని చెప్పుకొచ్చారు. ఒక్కో ఏఈ కి 3 నుంచి 4 మండలాలు అప్పగించి పని భారం పెంచారని వ్యాఖ్యనించారు.
Also Read: Paytmపై ఆర్బీఐ చర్యలు.. ఇప్పుడు మనం ఏమి చేయాలి?
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్వేలో 16 , 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో.. రెండో తరగతి చదువుకునే పిల్లవాడుకున్న జ్ఞానం కూడా లేదని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో 18 వేల టీచర్ పోస్టులు నారా చంద్రబాబు భర్తీ చేశారని అన్నారు. పట్టభద్రుల నిరుద్యోగిత పెరిగిపోయిందని విమర్శించారు. ఏపీలో ఓట్లు తొలగిస్తున్నారు.. సిపిఎస్ రద్దు ఏమైంది? రైల్వేజోన్ కు భూమి కూడా ఇవ్వలేదు. మద్యాన్ని నిషేధిస్తామన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా దిక్కరించి రుషికొండకు గుండు కొట్టించారని కామెంట్స్ చేశారు. భీమిలిలో సిద్దం సభ చారిత్రక తప్పిదమని దుయ్యబట్టారు.