MLC Kavitha: నేను ముందే చెప్పా.. ఇండియా కూటమిపై కవిత ఇంట్రస్టింగ్ కామెంట్స్.. బిహార్ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. బిహార్ లో రాజకీయ పరిణామాలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. By Naren Kumar 28 Jan 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MLC Kavitha: బిహార్‌లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. జాతీయస్థాయిలో ఆ కూటమి నిలదొక్కుకునే అవకాశం లేదన్నారు కవిత. కాగా, బిహార్‌లో కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం నితీశ్‌కుమార్ రాజీనామా, తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర పరిణామాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బిహార్ రాజకీయ పరిణామాలపై ఆదివారం ఆమె స్పందించారు. బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీల బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఇది కూడా చదవండి: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు నితీశ్ కుమార్ తన రాజకీయ స్వీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను అగమ్యగోచరంగా తయారు చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో అది క్రమంగా బలహీనపడుతోందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో కుల గణన జరగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: BRS MLAs: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది? ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. కీలక నేతలు ఇండియా కూటమి నుంచి వెళ్లిపోవడంతో.. ఈ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఈ కూటమిలో కాంగ్రెస్, తమిళనాడు నుంచి డీఎంకే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ పార్టీలు మాత్రమే మిగిలాయి. మిగతావి చిన్న చిన్న పార్టీలు మాత్రమే ఉన్నాయి. #brs-mlc-kalvakuntla-kavitha సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి