MLC Kavitha: మీరు పోలీసులేనా!.. విద్యార్థిపై అమానుష దాడి హేయమైన చర్య.. ట్విట్టర్‌లో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసులు జట్టు పట్టుకుని దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని, సంఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

MLC Kavitha: మీరు పోలీసులేనా!.. విద్యార్థిపై అమానుష దాడి హేయమైన చర్య.. ట్విట్టర్‌లో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
New Update

MLC Kavitha: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసులు జట్టు పట్టుకుని దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని, సంఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఈడ్చుకెళ్లడం అభ్యంతరకరమన్నారు. దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై మానవ హక్కుల కమిషన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పిలుపునిచ్చారు.

కాగా, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములకు సంబంధించి జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఓ మహిళా పోలీసు ప్రవర్తన ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. ఆందోళన చేస్తున్న ఓ ఏబీవీపీ మహిళా కార్యకర్తను పరుగెత్తుతున్న సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌ బైక్‌పై ఫాలో అవుతూ జుట్టుపట్టి లాగారు. దీంతో ఆ విద్యార్థి కిందపడిపోయింది. ప్రాధేయపడ్డా పోలీసులు వినకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేసీఆర్‌ ఓటమికి కేటీఆరే కారణం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

#mlc-kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe