/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-25T001440.242-jpg.webp)
MLC Kavitha: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసులు జట్టు పట్టుకుని దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని, సంఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఈడ్చుకెళ్లడం అభ్యంతరకరమన్నారు. దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై మానవ హక్కుల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పిలుపునిచ్చారు.
The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police.
This… pic.twitter.com/p3DH812ZBS
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024
కాగా, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములకు సంబంధించి జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ మహిళా పోలీసు ప్రవర్తన ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. ఆందోళన చేస్తున్న ఓ ఏబీవీపీ మహిళా కార్యకర్తను పరుగెత్తుతున్న సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ బైక్‌పై ఫాలో అవుతూ జుట్టుపట్టి లాగారు. దీంతో ఆ విద్యార్థి కిందపడిపోయింది. ప్రాధేయపడ్డా పోలీసులు వినకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేసీఆర్ ఓటమికి కేటీఆరే కారణం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు