MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండూ కేసుల్లోనూ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. 

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ న్యాయస్థానం ఆమెకు బెయిల్ ను నిరాకరించడంతో వారు షాక్ కు గురయ్యారు.

కవితదే కీలక పాత్ర: సీబీఐ
లిక్కర్ స్కామ్‌ కేసులో కవితదే కీలక పాత్ర అని సీబీఐ కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. ఆమె బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇదిలా ఉంటే.. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్ లో ఉన్నారు కవిత.

కవిత వాదనలివే..
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. తాను ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొనాల్సి ఉందన్నారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం తనకు బెయిల్‌ పొందే అర్హత ఉందని కోర్టుకు తెలిపారు. కోర్టు మాత్రం విచారణ అనంతరం బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

గతంలో కుమారుడి పరీక్షల కోసం..
గతంలోనూ తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. ఆ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో కవిత మరికొన్ని రోజులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. బెయిల్ కోసం కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు