MLC Kasireddy: బీఆర్ఎస్ కు షాక్... ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా..!!

MLC Kasireddy:  బీఆర్ఎస్ కు షాక్... ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా..!!
New Update

బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఆయనతోపాటు నాగర్ కర్నూల్ జిల్లా షరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాగా కసిరెడ్డి ఇవాళ ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. రానున్న ఎలక్షన్స్ లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టీకెట్ ఆశించారు కసిరెడ్డి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో ఆయనకే టిక్కెట్టు కేటాయించారు. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు.

కాగా గత కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు మూడు సార్లు అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారు. గత నెలలో బీఆర్ఎస్ టిక్కెట్లను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కల్వకుర్తి టిక్కెట్టు కసిరెడ్డికి దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈతరుణంలోనే కసిరెడ్డి గతవారం ముఖ్య అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కసిరెడ్డి బరిలోదిగుతారని అతని అనుచరులు చెబుతున్నారు. కాగా బీఆర్ఎస్ లోకి రాకముందు కసిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి : యూజీసీనెట్ 2023 దరఖాస్తులు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే..!!

గతంలో కల్వకుర్తి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన భారీ ఓట్లను సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ సమయంలో కేటీఆర్ కసిరెడ్డి ఒప్పించారు. దీంతో కసిరెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎమ్మెల్సీ పదవి పొడిగించింది. జైపాల్ యాదవ్ కు కసిరెడ్డికి మధ్య వార్ కూడా జరిగింది. అయితే కసిరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త…!!

#brs #telangana-assembly-elections-2023 #mlc-kasireddy #kasireddy-narayana-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe