Breaking: RTV, NTV జర్నలిస్టులపై ఎమ్మెల్సీ చల్లా గూండాల దాడి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గూండాలు ఆర్టీవీ రిపోర్టర్, కెమెరామెన్‌పై మీద దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కోకాపేట్‌ సర్వే 85లో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు ఎమ్మెల్సీ చల్లా బ్రదర్స్ అనుచరులు యత్నించారు.

New Update
Breaking: RTV, NTV జర్నలిస్టులపై  ఎమ్మెల్సీ చల్లా గూండాల దాడి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గూండాలు ఆర్టీవీ రిపోర్టర్, కెమెరామెన్‌పై మీద దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులోని కోకాపేట సర్వే 85లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఎమ్మెల్సీ చల్లా బ్రదర్స్ అనుచరులు యత్నించారు.

దీనిని చిత్రీకిరంచేందుకు వెళ్లిన ఎన్టీవీ, ఆర్టీవీ జర్నలిస్టులపై ఎమ్మెల్సీ గూండాలు దాడికి దిగారు. కెమెరాలు, ఫోన్లను ధ్వంసం చేశారు. నార్సింగ్ పీఎస్‌లో ఎమ్మెల్సీ అనుచరులపై జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. కోకాపేటలో భూముల విలువ పెరగడంతో భూముల కబ్జాకు ఎమ్మెల్సీ బ్రదర్స్ కుట్ర చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్సీ చల్లా వెంట్రారెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కలిసి అక్కడ నివసిస్తున్న పేద వాళ్లను తన అనుచరులతో బలవంతంగా ఖాళీ చేయించారు. అందులో గర్భిణీలతో పాటు మహిళలు, చిన్నపిల్లలు అని కూడా కనికరం చూపించకుండా బయటకు నెట్టివేశారు.  ఈ మేరకు గోల్డ్ ఫిష్ అడోబ్ ప్రైవేట్ లిమిటెడ్ ట్వీట్ చేసింది.

అసలు ఏం జరిగిందంటే..

శనివారం ఉదయం అయిదున్నర గంటలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కారు.. వందమంది బౌన్సర్స్, మూడు కంటైనర్స్, రెండున్నర ఎకరాలకు సరిపోయే రేకులు. ఒక్కసారిగా భీభత్సం సృష్టించారు. అప్పటికే 50 కుటుంబాలతో లేబర్ క్యాంపు ఉంటే వెంటనే ఖాళీ చేయాలని సామాన్లు అన్ని బయటపడేసి జేసీబీలతో కూల్చివేశారు. అధికార బలం ఉండటంతో డయల్ 100కి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. సినిమాల్లో చూపించినట్లు అంతా అయిపోయాక 9:30 నిమిషాలకు వచ్చి.. సివిల్ మ్యాటర్ అంటూ సెలవిచ్చారు.

కబ్జాల పరంపర..

కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు దాటేసరికి ప్రతి చిన్న వివాదాన్ని పట్టుకుని అధికార బలంతో కబ్జాలకు పాల్పడుతున్నారు. మూడు నెలల క్రితం ఈఐపీఎల్ కంపనీ, ఇటీవల శివాలయానికి చెందిన 5 ఎకరాల కబ్జా మరవక ముందే వందల మందితో సర్వే నెంబర్ రెండున్నర ఎకరాలు కబ్జా పెట్టేశారు. ఇలా నిత్యం కబ్జాల పరంపర కొనసాగుతున్నా పోలీసులు అధికారపార్టీ అండదండలు ఉన్నవారికే సపోర్టు చేయడంతో కబ్జా హక్కులను కొల్పోతున్నారు బాధితులు.

భూ వివాదం ఇదే..

కోకాపేట భూములకు మట్టి రోడ్డు కూడా గతి లేనప్పుడు భూములు కొనుగోలు చేసింది గోల్డ్ ఫిష్ అబాడే. డబ్బులు అడ్జెస్ట్మెంట్ కోసం ఇన్వేస్టర్స్ ని భూములు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే చల్లా వెంకటరామిరెడ్డి, సంతోష్‌ రెడ్డి, కర్నాకర్ లు 4 కోట్ల రూపాయలు ఇచ్చి.. 2.20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదే రోజు బిల్డర్ తో డీజీపీఏ రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. డాక్యుమెంట్ నెంబర్ : 3781/2013. ఇందులో 90వేల 750 స్వేయిర్ ఫీట్ల ఎరియాని ఇన్వేస్టర్స్ కి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటికే సర్వే నెంబర్ 84లో విల్లాల నిర్మాణం చేపట్టిన బిల్డర్ కి ఇన్వేస్టర్స్ ఇప్పుడు నిర్మాణం చేపట్టవద్దని కోరారు.

తెలంగాణ ఉద్యమంతో మార్కెట్ పూర్తిగా డల్ అయింది. 2013లోనే నాలా కన్వర్షన్, ల్యాండ్ కన్వర్షన్ తో పాటు ఫైర్, ఎన్వరాల్మెంట్, ఎయిర్ ఫోర్ట్ ఎన్ఓసీలు తీసుకున్నారు. అప్పటి నుంచే పనులు స్లోగా ప్రారంభించారు. అయితే మార్కెట్ లేకపోవడంతో అలస్యం చేశారు. ఇవే అనుమతులు మళ్లీ 2019లో తీసుకున్నారు. కోవిడ్ తో మళ్లీ అలస్యం అయింది. అప్పటికే గోల్డ్ ఫిష్ సంస్థ ఆ భూమి అభివృద్దికి 12 కోట్లు ఖర్చు చేసింది. కోకాపేట భూములు బంగారు బాతులుగా మారడం. అనుమతుల్లో 39 అంతస్తులు రావడం, 5 స్టార్ హోటల్స్ వారు సంప్రదించడంతో ఇన్వేస్టర్స్ కి ఆశలు చెలరేగాయి. ఇటీవల చల్లా ఎమ్మెల్సీ కావడంతో.. ఎమ్మెల్యే బీరం హార్షవర్దన్ రెడ్డితో కలిసి భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు కుట్రలు పన్నారు.

కోర్టులో కేసు నడుస్తుండగానే భూమిని లాక్కుంటున్నారు..

ఇన్వేస్టర్స్ గా ఉన్న ఎమ్మెల్సీ చల్లా కోర్టును ఆశ్రయించారు. OS no. 243/2022. డీఏజీపీలో పొజిషన్ తో పాటు నిర్మాణం చేయాలని స్పష్టంగా ఉన్నా.. ఆ పోజిషన్ తీసుకునేందుకు కబ్జాకు ప్రయత్నించారు. అనుమతులు వచ్చినా.. వాటిని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. ఆ ప్రాజెక్ట్ విలువ 1500 కోట్లు కావడంతో ఆశలు సప్లమెంటరీ అగ్రిమెంట్స్, ఎంవోయిలను కాదని అధికార బలంతో భూమిని మొత్తమే స్వాధీనం చేసుకుంటున్నారు.

చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాపై దౌర్జన్యం.

అశ్వంత్ కాటం రెడ్డి, దేశ్ కాంత్ రెడ్డి, అగస్ట్యా రెడ్డిలు ఎమ్మెల్సీ స్టికర్ ఉన్న కారుతో వచ్చి భయాందోళనకు గురిచేశారు. అనధికారికంగా భూమిని లాక్కుంటున్నారని తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. కబ్జా దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా వాళ్ల సెల్ ఫోన్స్ లాక్కుని వీడియోలు డిలిట్ చేసి. దాడులకు దిగారు. మీడియాలో రాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అధికారంతో ఇష్టానుసారంగా వ్యవహారించిన తీరుని చూస్తే.. కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా స్టైల్ ఏంటో చూపించారని అర్ధమవుతుంది.

Advertisment
తాజా కథనాలు