/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ycp-mla-1-jpg.webp)
MLA Thippeswamy: వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన కథనాలపై మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి స్పందించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పా తప్ప ప్రభుత్వం, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. పార్టీ కన్నా వైఎస్ఆర్ కుటుంబమే ముఖ్యమని పేర్కొన్నారు. తాను నలభైఐదు ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నానన్నారు. వైఎస్ఆర్ హయాం నుంచే ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. తాను పార్టీ మారే వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చారు.
Also Read:హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..!
చిత్తూరు జిల్లాలో డాక్టర్ గా పనిచేస్తున్న తనను పలమనేరు ఎమ్మెల్యేగా రాజశేఖరరెడ్డి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ వల్లే రాజకీయాల్లోకి వచ్చి..ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినట్లు తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో కూడా పెద్దిరెడ్డి, చంద్రబాబు, వైఎస్ఆర్ సహచరులేనన్నారు. మడకశిరలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నానట్లు వ్యాఖ్యానించారు. అయితే, ఈ సారి పలు కారణాలతోనే వేరే వ్యక్తిని సమన్వయకర్తగా నియమించినట్లు పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్.!
అడగకుండానే టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చారని కామెంట్స్ చేశారు. తిప్పేస్వామి అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడని స్పష్టం చేశారు. పార్టీలో ఉండి సీటు కోసం ప్రయత్నిస్తా తప్ప పార్టీ మారే పరిస్థితే లేదని వివరించారు. మళ్లీ సీఎంగా జగనే కావాలని ఆశభావం వ్యక్తం చేశారు.