YCP: నంద్యాల జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు..! నంద్యాల జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే శిల్పారవి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, వీడియోలోని డైలాగ్ ను అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు వైసీపీ జడ్పీటీసీ గోకుల్ రెడ్డి. By Jyoshna Sappogula 02 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి YCP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏ పార్టీ నేతలు ఆ పార్టీకి సపోర్టు చేస్తూ గెలుపు కోసం పోరాడాల్సింది పోయి వర్గ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల కోసం పార్టీని గెలిపించాల్సిన నాయకులే అంతర్గత విభేదాలతో రోడ్డెక్కుతున్నారు. తాజాగా, నంద్యాల జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. Also Read: గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వకండి: తోట రాజీవ్ Your browser does not support the video tag. గత కొంత కాలంగా ఎమ్మెల్యే శిల్పారవి పనితీరును, మాటలను నంద్యాల వైసీపీ జడ్పీటీసీ గోకుల్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎమ్మెల్యే శిల్పారవిపై తిరుబాటు జెండా ఎగురవేశారు జడ్పీటీసీ గోకుల్ రెడ్డి. ఇందుకుకారణం సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కు చెందిన ఒక వీడియో వైరల్ కావటంమే. ఆ వీడియోలో ఉన్న డైలాగ్ ను అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోకుల్ రెడ్డి నిరసనకు దిగనున్నారు. రేపు నంద్యాలలో స్థానిక గాంధీచౌక్ లో ధర్నాకు పిలుపునిచ్చారు. Also Read: జవహర్ వద్దు – టీడీపీ ముద్దు.. బయటపడ్డ వర్గ విభేదాలు..! ఆ వీడియోలో ఉన్న వ్యాఖ్యాలపై ఎమ్మెల్యే శిల్పారవి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాంటి అసభ్య పదజాలంతో తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని అందుకు నిరసనగా రేపు నిరసన యాత్ర, దీక్ష చేపడుతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. అయితే, ఈ వర్గ విభేదాలపై అధిష్టానం స్పందించి గొడవను సరిదిద్దే ప్రయత్నం చేస్తుందా? లేదంటే చూసి చూడనట్లుగా వదిలేస్తుందా? అనేది వేచి చూడాలి. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి