/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nellore-1.jpg)
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పాలకొండసత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.