MLA Ragunandan Rao: వాళ్లను బొంద పెడతాం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్..

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హిందువులను బొందుగాళ్లన్న వారిని ఇందూరులో బొంద పెడతామని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తెలియని మంత్రులు దేశంలో ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

New Update
MLA Ragunandan Rao: వాళ్లను బొంద పెడతాం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్..

MLA Raghunandan Rao: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హిందువులను బొందుగాళ్లన్న వారిని ఇందూరులో బొంద పెడతామని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తెలియని మంత్రులు దేశంలో ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. పొలికల్‌గా కాకరేపే కామెంట్స్ చేశారు. పార్లమెంటు సెషన్ పూర్తి కాగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.

నవీపేట్ చౌరస్తాలో శివాజీ విగ్రహావిష్కరణకి ప్రతి హిందూ బంధు సహకారం ఉందని, వారందరి సహకారంతోనే ఈ విగ్రహావిష్కరణ జరిగిందన్నారు. శివాజీ విగ్రహ దాత మేడపటి ప్రకాష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రఘునందన్ రావు. ఎవరు ఏమనుకున్నా ఈ దేశంలో నూటికి 90 శాతం మంది హిందువులే ఉన్నారని వ్యాఖ్యానించారు. హిందువులని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మన హిందూ ధర్మం.. సనాతన ధర్మం.. వేరే మతాలని కూడా గౌరవించాలని చెబుతాయని అన్నారు రఘునందన్ రావు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎంతోమంది ఎన్నో విషయాలు అన్నా.. ఇదే ప్లేస్ లో ఈట్ జవాబు పత్తర్ సే దేంగే అన్నట్లుగా రియాక్ట్ అయ్యామన్నారు.

ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ..

కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థులకు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. వారు వినలేదు. దాంతో పోలీసులు.. తమదైన స్టైల్‌లో వారిని శాంతిపజేశారు. అయితే, చౌరస్తాలో ఒక్కసారిగా ఈ ఘర్షణ జరగడంలో జనాలు భయాందోళనకు గురయ్యారు.

Also Read:

G20 Summit Live Updates: యూఎస్‌ ప్రెసిడెంట్ బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

Hong Kong Rains: హాంకాంగ్‌పై వరుణ ప్రతాపం.. 140 ఏళ్లలో కనివిని ఎరుగని వర్షం..

Advertisment
Advertisment
తాజా కథనాలు