మార్పు కోసం ఈ సారి అవకాశం ఇవ్వండీ..!! నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని బీఆర్‌ఎస్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఎమ్మెల్యే రఘునందన్ అభ్యర్థించారు. By Jyoshna Sappogula 20 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA Raghunandan Rao: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ దుయ్యబట్టారు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. తనను గెలిపించిన రెండున్నర సంవత్సరాల్లో దుబ్బాక రూపురేఖలు మార్చానని ఆయన వెల్లడించారు. హరీష్ రావు పొద్దున లేస్తే అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఏం చేస్తాడంటూ దుయ్యబట్టారు. దుబ్బాక లో నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read: తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా ఓబీసీ కులగణన? రాహుల్ అస్త్రాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొనున్నారు? హరీష్ రావు పొద్దున లేస్తే అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఏం చేస్తాడంటూ దూషించారు. రఘునందన్ రావు గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడుతాడని ప్రజలను భయపెడుతున్నాడని..అయితే ఆయన మాటలు ఏమీ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్ సంకలో చేరడం ఖాయం అంటూ ఎద్దెవ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీని ఓడించిన ఘనత కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ దని కీర్తించారు. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క ఎస్సీకి కూడా మంత్రి పదవి లేదని తెలిపారు. బిసి లకు సమన్యాయం చేసే పార్టీ కేవలం బిజెపి పార్టేనని చెప్పుకొచ్చారు. 119 సీట్ల లో 70 బిసిలకు ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బిజెపి కి ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఎమ్మెల్యే రఘునందన్ అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి పూర్తి చేసి చూపించానని ఎమ్మెల్యే అన్నారు. తనకు భయపడి దుబ్బాక లో బస్టాండ్ కట్టించారనన్నారు. దుబ్బాక అభివృద్ధి పై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఏ మాత్రం సోయి లేదని దుయ్యబట్టారు. పట్టణంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించిన ఘనత రఘునందన్ రావు దంటూ వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ పెద్దలు కనీసం పార్టీ శ్రేణులను గుర్తు పట్టరని విమర్శలు గుప్పించారు. సిద్దిపేట దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ, మైనార్టీ శాఖ మంత్రి స్మ్రుతి ఇరానీ హాజరైయ్యారు . #mla-raghunandan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి