మార్పు కోసం ఈ సారి అవకాశం ఇవ్వండీ..!!
నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఎమ్మెల్యే రఘునందన్ అభ్యర్థించారు.