MLA Raghu Rama Raju: మాజీ సీఎం జగన్ గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు స్పష్టం చేశారు. ఇక వైసీపీ పైన ప్రజల దృష్టి ఉండదని.. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా?.. ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారని అన్నారు.
Also Read: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు
అందుకే తాము కూడా ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి పెట్టామని రఘురామ చెప్పారు. తప్పు చేసిన వాళ్లను చట్టం శిక్షించుతుందని చెప్పారు. అందుకే తనకు జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే రఘురామ పేర్కొన్నారు.