Andhra Pradesh: వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో కామెంట్స్ చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ ఇచ్చారు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. 2018లో గత టీడీపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై చేసినట్లుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Shiva.K 16 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Andhra Pradesh: ఏపీలో సీఎం జగన్ పాలనా విధానాన్ని తప్పుపడుతూ కామెంట్స్ చేసినట్లుగా ఉన్న తన వీడియోపై కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పటిది కాదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వారు కావాలనే తనను, తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో విజయనగరం జిల్లాలోని ఒక మాస్పిటల్‌లో గిరిజిన బాలికకు అందించే వైద్యం తీరు చూసి చాలా బాధపడుతున్నానని శ్రీవాణి కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్‌తో కూడిన వీడియోను కొందరు యూట్యూబ్ చానళ్లలో 'ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినందుకు చచ్చిపోవాలనుంది.. జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పుష్ప శ్రీవాణి' అంటూ థంబ్‌నెయిల్స్‌తో వీడియోను వైరల్ చేశారు. అయితే, వీడియోపై తాజాగా పాముల పుష్ప శ్రీవాణి స్పందించారు. తన పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న భారీ కుట్ర ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇస్తూ మరొక వీడియోను విడుదల చేశారు శ్రీవాణి. తెలుగుదేశం పార్టీ వాళ్ల దిగజారుడు తనానికి నిదర్శనం ఈ వీడియో అని విమర్శించారు. అబద్ధపు ప్రచారాలతో జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, ఈ వీడియోనే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. తెలుగుదేశం వాళ్లు నా పై చేసే తప్పుడు ప్రచారానికి నా సమాధానం 😡 https://t.co/BqTZ8CNsUx — Pamula Pushpa Sreevani (@PushpaSreevani) December 16, 2023 వాస్తవానికి ఈ వీడియో 5 సంవత్సరాల క్రితానిది అని తెలిపారు శ్రీవాణి. '2018 సెప్టెంబర్‌లో విజయనగరం సాలూరులో ఒక హాస్పిటల్‌లో 15 మంది ట్రైబర్ గర్ల్ స్టూడెంట్స్‌ని కింద కూర్చోబెట్టి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వారందరినీ కింద కూర్చోబెట్టి ఒకే స్టాండ్‌కి సెలైన్ బాటిల్స్ పెట్టి వైద్యం అందించారు. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. దానిపై అప్పుడు స్పందించాను. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకాన్ని తప్పుపడుతూ వీడియో విడుదల చేశాను. గిరిజనుల పట్ల వైద్య సిబ్బంది అనుసరించిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేశాను. కానీ, నాటి వీడియోను ఇప్పటి వీడియోగా.. జగన్ ప్రభుత్వంపై తాను అసంతృప్తితో ఉన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు టీడీపీ నాయకులు తప్ప ఎవరూ చేయరు. జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం.. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తన వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తూ రాక్షసానాందం పొందుతున్నారు. ప్రజలు ఈ ప్రచారాలను విశ్వసించొద్దు. ప్రభుత్వానికి, ప్రజలు వారధిగా ప్రతిపక్షం పని చేస్తే బాగుండేది. కానీ, ఇలా కుట్రలు, కుయుక్తులు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. టీడీపీ నేతల చేష్టలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. Also Read: కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్.. రూల్స్ ఇవేనా?! ‘ఇందిరమ్మ కానుక’ ఎప్పటి నుంచి అమలు? కీలక అప్‌డేట్స్ మీకోసం.. #andhra-pradesh #pushpa-srivani-viral-video #kurupam-assembly-constituency మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి