Bigg Boss: బిగ్ బాస్‌ లో ట్విస్ట్.. కంటెస్టెంట్ గా ఎమ్మెల్యే..!!

కన్నడ పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ షోను అక్కడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. అయితే హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ మీదకు ఆహ్వానించి హౌస్ లోకి పంపించారు. అయితే, ఈసారి డిఫరెంట్ గా కన్నడ బిగ్ బాస్ లో ప్రజానేత కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. దీంతో బిగ్ బాస్ అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేపై ప్రజలు దూమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే..నియోజకవర్గ సమస్యలు తీర్చకుండా ఇలా రియాలిటీ షోలకు వెళ్లడం ఏంటని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Bigg Boss: బిగ్ బాస్‌ లో ట్విస్ట్..  కంటెస్టెంట్ గా ఎమ్మెల్యే..!!
New Update

MLA Pradeep Eshwar: కన్నడ పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 10  గ్రాండ్ గా మొదలైంది. కన్నడ బిగ్ బాస్ షో బహుబాష నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ (Kiccha Sudeep) నిర్వహిస్తున్నాడు. హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ మీదకు ఆహ్వానించి హౌస్ లోకి పంపించారు. అయితే, ఈసారి డిఫరెంట్ గా కన్నడ బిగ్ బాస్ లో ప్రజానేత కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. దీంతో బిగ్ బాస్ అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారిని వంద రోజులు ఒకే ఇంట్లో ఉంచడం పెద్ద పని అనే విషయం తెలిసిందే. ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారనే క్యూరియాసిటీని బిగ్ బాస్ హౌస్ వంద రోజుల పాటు ఉంచుతుంది. ఆదివారం నుంచి ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ షోలో ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు.

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ (MLA Pradeep Eshwar) బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో సర్వత్రా ఆశక్తి నెలకొంది. సోమవారం రాత్రి 9.30 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినట్లు షో లో కనిపిస్తోంది.  అయితే, కొద్దిరోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెస్ట్ గా ఉండొచ్చని బిగ్ బాస్ షో అభిమానులు అంటున్నారు.

బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ మాట్లాడుతూ ..తాము ఓ ఎమ్మెల్యేలతో  పోటీ చెయ్యడం చాలా థ్రిల్ గా ఉందని  అంటున్నారు. మరోవైపు కంటెస్టెంట్ గా MLA గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో  ఎమ్మెల్యేపై ప్రజలు దూమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే..నియోజకవర్గ సమస్యలు తీర్చకుండా ఇలా రియాలిటీ షోలకు వెళ్లడం ఏంటని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తోంది.

Also Read: అభిమానికి మాస్ కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్ బిగ్ బి..!

#mla-pradeep-eshwar-in-bigg-boss #bigg-boss-kannada #bigg-boss-season-10 #pradeep-eshwar-mla
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe