Bigg Boss: బిగ్ బాస్ లో ట్విస్ట్.. కంటెస్టెంట్ గా ఎమ్మెల్యే..!!
కన్నడ పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ షోను అక్కడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. అయితే హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ మీదకు ఆహ్వానించి హౌస్ లోకి పంపించారు. అయితే, ఈసారి డిఫరెంట్ గా కన్నడ బిగ్ బాస్ లో ప్రజానేత కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. దీంతో బిగ్ బాస్ అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేపై ప్రజలు దూమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే..నియోజకవర్గ సమస్యలు తీర్చకుండా ఇలా రియాలిటీ షోలకు వెళ్లడం ఏంటని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తుతున్నారు.