MLA KTR: రుణమాఫీపై రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ

TG: రుణమాఫీపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 100 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

MLA KTR: రుణమాఫీపై రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
New Update

MLA KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరుస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు రక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని అన్నారు. 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని ఫైర్ అయ్యారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖ లో డిమాండ్ చేశారు.

లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే... వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతామని స్పష్టం చేశారు.

#mla-ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe