MLA KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

MLA KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు
New Update

MLA KTR:  తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పేరును కాంగ్రెస్ నేతలు ప్రస్తావించడంపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం ను అయినా వదిలిపెట్టానని.. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై  ఫైర్ అయ్యారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ALSO READ: నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

కేటీఆర్‌పై  కొండా సురేఖ హాట్ కామెంట్స్.. 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైలుకు వెళ్లడం ఖాయామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడన్నారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశాడన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చాడే తప్ప.. రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు. 

అధికారం లేకనే కేసీఆర్‌ (KCR) , కేటీఆర్‌  కొత్త డ్రామాలకు తెర తీశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే హక్కు కేసీఆర్‌ కు లేదన్నారు.
కేసీఆర్‌ పాలనలో ధనిక రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పుల పాలు చేశారని విమర్శించారు. కవిత మద్యం కేసు లో జైలులో ఉందనే విషయాన్ని వారు మరిచిపోయినట్లున్నారని కొండా ఎద్దేవా చేశారు.

వారి హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా వారికి ఆర్థిక సహాయం చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 5 గ్యారెంటీలను (Congress Guarantees) అమలు చేశామన్నారు. రైతులకు రాయితీలను ఎత్తేసి రైతు భీమా ఇచ్చామని తెలిపారు. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#mla-ktr #minister-konda-sureka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe