MLA KTR: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ నా మాటలు గుర్తుంచుకోండని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్త తొలిగిస్తామన్నారు. బీఆర్ఎస్ రాగానే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం.. ఢిల్లీ గులాంలు రాష్ట్ర ఆత్మగౌరవం అర్థం చేసుకుంటారని ఆశించలేం అని అన్నారు. చెత్తమాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోందని అన్నారు.
రేవంత్ ఏమన్నారంటే...
బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని చెప్పారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎం రేవంత్ సవాల్ చేశారు.