MLA KTR: నిన్న రాత్రి సిద్దిపేటలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ హింస, ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలీసుల క్రియాశీల మద్దతుతో హింసను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఈ నీచ స్థాయి, 3వ స్థాయి రాజకీయ అవివేకాన్ని చూస్తున్నారని.. భవిష్యత్తులో తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
అసలేం జరిగింది...
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు హల్ చల్ చేశారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) క్యాంపు ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. క్యాంప్ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. ఆఫీస్ పైకెక్కి హడావిడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ మాటతప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించేశారు. ఆఫీస్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!