AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..!

కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

New Update
AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..!

Kakinada: కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు (Aarudra) ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్ర సచివాలయం లోని నాలుగో బ్లాకులో అధికారులు తనకు చెక్కు రూపంలో ఈ సాయం అందించారని ఆరుద్ర వెల్లడించారు.

Also Read: పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల స్పెషల్ ఫోకస్..!

ఆమె మాట్లాడుతూ "జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు లేదు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును  అందించారు. నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించి నందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది. " అని అన్నారు.

Also Read: ఆళ్ళగడ్డలో ఆందోళన.. ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్..!

అన్నవరం, అమలా పురం, కాకినాడలలో తమను ఇబ్బంది పెట్టినవారిపై కేసులు నమోదు చేయాలని.. పోలీసుల మీద ప్రత్యేక కమిషన్ వేసి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆరుద్ర కోరారు. కోర్టు కేసులు కొట్టించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని.. ఈ పరిస్థితికి, తాము అప్పులపాలవడానికి కారకులపై వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి చేతికి అందక, కుమార్తె వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు