MLA Padmavathi : రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు?: పద్మావతి

ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు? అని ప్రశ్నించారు సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సింగనమల వైసీపీ కొత్త ఇన్చార్జ్ రామాంజనేయులుకు మా సహకారం లేదు అనేది అవాస్తవమన్నారు.

New Update
MLA Padmavathi : రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు?: పద్మావతి

MLA Jonnalagadda Padmavathi : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు అన్ని విధాల అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో వైయస్ షర్మిల(YS Sharmila) ఎలా చేరారు? అని ప్రశ్నించారు సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి(Jonnalagadda Padmavathy). ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ...అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ నే కదా? మరి ఆ పార్టీలో ఎలా చేరుతారు? అని అన్నారు.

Also Read: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్‌ భేటీ!

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురాలేదు అని మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని వ్యాఖ్యనించారు. జగనన్న(YS Jagan) మీకు చెల్లెలు షర్మిల(YS Sharmila) ఒక్కరు మీ వెంట లేరేమో కానీ నేను, నాలాంటి అక్క చెల్లెమ్మలు రాష్ట్రవ్యాప్తంగా మీ వెంటే ఉన్నారని కామెంట్స్ చేశారు.కాగా, సింగనమల వైసిపి కొత్త ఇన్చార్జ్ గా ఎం వీరాంజనేయులుని నియమించారు.

Also Read: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష

ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త ఇన్చార్జికి మా సహకారం లేదు అనేది అవాస్తవమని..అయితే, రామాంజనేయులను నా సొంత తమ్ముడు గా భావించి గెలుపుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నన్ను కాదని వీరాంజనేయులుకు సీటు ఇవ్వడం అది జగనన్న నిర్ణయమన్నారు. చాలా నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలుస్తారన్న చోట కూడా చాలామందిని మార్చారని.. ఇదంతా ఎన్నికలలో భాగమేనని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికలలో జగనన్న చెప్పినట్టు 175 కు 175 సీట్లు కచ్చితంగా గెలవబోతున్నమని ధీమ వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు