G. V. Anjaneyulu: ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది.. జగన్ పై ఎమ్మెల్యే జీవీ ఫైర్.!

అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలనేదే టీడీపీ సంకల్పమన్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని జనం అనుకుంటున్నారని కామెంట్స్ చేశారు.

G. V. Anjaneyulu: ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది.. జగన్ పై ఎమ్మెల్యే జీవీ ఫైర్.!
New Update

G. V. Anjaneyulu: పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని జనం అనుకుంటున్నారన్నారు. అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైందని పేద ప్రజలు భావిస్తున్నారన్నారు.

సంకల్పం ఇదే..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభ పరిణామం అని..స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ విజయం లేదని కామెంట్స్ చేశారు. చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలనేదే టీడీపీ సంకల్పమన్నారు.

బాధ్యత పెరిగింది..

పల్నాడు జిల్లాలో ఏడు స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి మమ్మల్ని ప్రజలు ఆదరించారని.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో  తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకి దిగినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలన్నారు. జిల్లాలో గంజాయి, గుట్కాపై రెండు నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..!

మా ధ్యేయం..

వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే మా ధ్యేయం అని.. గతంలో జిల్లాలోని వైసీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా రాకూడదని అన్నారు. దేశంలో మచ్చ లేని నాయకుల్లో చంద్రబాబు ఒకరని.. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారన్నారు.

రుణం తీర్చుకుంటాం..

తమ గెలుపుకి అన్ని విధాలుగా సహకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలకు రుణపడి ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యాలయాలను ప్రజా పరిపాలన వేదికలుగా మారుస్తామన్నారు. అమరావతి, పోలవరం వెంటనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వరికపూడిసెల ఎత్తిపోతల పథకం పూర్తి చేసి పల్నాడు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.

#g-v-anjaneyulu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe