/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Danam-Nagender-.jpg)
కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక నేపథ్యంలో గాంధీభవన్‌లో మీడియాతో దానం చిట్‌చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి మరికొంత మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని కామెంట్ చేశారు. మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, K.వివేకానంద, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ కాంగ్రెస్‌లోకి వస్తారని సంచలన ప్రకటన చేశారు. హరీష్ రావు, మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్తారన్నారు దానం నాగేందర్. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీ కొంపముంచాయన్నారు.