అధికారంలోకి వస్తే చేసేది ఇదే..బర్రెలక్క షాకింగ్ కామెంట్స్.!

కొల్లాపూర్‌ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అభ్యర్ధి బర్రెలక్క పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు బాగు చేస్తానని..ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అన్నారు. మండలానికి ఒక కాలేజ్ అలాగే కోచింగ్ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యనించారు.

అధికారంలోకి వస్తే చేసేది ఇదే..బర్రెలక్క షాకింగ్ కామెంట్స్.!
New Update

MLA candidate Barrelakka: కొల్లాపూర్‌ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్ధి బర్రెలక్క పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. బూత్‌ దగ్గర ఉంటామని మాకు అండగా వచ్చిన వారిని అపోజిషన్ పార్టీ వారు కాల్ చేసి బూత్‌ దగ్గర ఉంటే మర్యాదగా ఉండదని భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనపై దాడి జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ..అప్పుడు తాను ఒక్కదానినే ఉన్నానని, ఇప్పుడు తనకు భారత దేశమంతా అండగా ఉందని.. తననేమీ చేయలేరని ధీమ వ్యక్తం చేసింది.

కొందరు నాయకులు 25 సంవత్సరాలకు పైగా రాజాకీయాల్లో ఉంటున్నారు కానీ, ప్రజల సమస్యలు మాత్రం వారికి కనిపించవని దుయ్యబట్టారు. ఎలక్షన్స్‌ అప్పుడు చేతులెత్తి దండలూ పెడుతూ కనిపిస్తారూ..ఎలక్షన్స్‌ అయ్యాక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మధాపూర్ లో ఇళ్లులు కట్టుకుని ఉంటారని..తరువాత ఇక్కడ అభివృద్ధిని పట్టించుకునేదేవరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఉండే వారికి అధికారం వస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. కొన్ని స్కూల్స్‌ లో వాష్ రూమ్స్ కూడా సరిగ్గా లేవని.. ఆడపిల్లలు ఎలా ఉండగలరు? అని ప్రశ్నించింది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని 117 గ్రామాల్లో కనీసం ఒక్క గ్రామానికైనా రోడ్డు మంచిగా ఉందా? అని నిలదీశారు. ఇంకొన్ని స్కూల్స్ లో కుక్కులు, పందులు తిరుగుతున్నాయని.. ఒకవేళ అవి పిల్లలను కరిస్తే వారి పరిస్థితి ఎంటో ఆలోచించాలన్నారు. ఇంకొన్ని చోట్ల స్కూల్ లో పెచ్చులు ఊడిపడుతున్నాయన్నారు.

Also read: నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే..ఈసీ హెచ్చరిక.!

కొల్లాపూర్ ప్రజలకు అండగా నిలబడుతానన్నారు. తనకు ఈ ప్రచారంలో రాజకీయం అనుభవం వచ్చిందని తెలిపారు. ప్రజలందరూ తనను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినందుకే ఆదరించారని.. కాబట్టి, ఎమ్మెల్యే అయిన, ఎంపీ అయినా.. వేరే ఏ పదువులు వచ్చినా స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడుతానని వ్యాఖ్యనించారు. చిన్న మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగు చేస్తానని..ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అన్నారు. ప్రతి మండలానికి ఇంటర్, డీగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తానని..తరువాత జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి కొన్ని కోచింగ్ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తానని కామెంట్స్ చేశారు.

కొల్లాపూర్ అభివృద్ధి శూన్యం అని వ్యాఖ్యనించారు. కేవలం అధికార పార్టీ నాయకులు మాత్రమే అభివృద్ధి పొందారు తప్ప ప్రజలు కాదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలకు రూ. 5 వేల కోట్లు వస్తాయి కాబట్టి.. ఆ మొత్తం సొమ్ము ప్రజల మంచి కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి ఎవరూ వచ్చినా సరే తన ప్రజల కోసం పోరాడుతానని.. అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని అన్నారు.

#telangana #telanagana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe