Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తక్కువ ధరలకే నిత్యావసర అమ్మకాలు ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. బియ్యం, కందిపప్పు పంపిణీకి శ్రీకారం చుట్టారు. మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన రైతు బజార్ లో సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు.
Also Read: వైసీపీ మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై సుబ్బారావు గుప్తా ఎక్స్‌క్లూజివ్.!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలాగా నిత్యవసర సరుకుల రేట్లు పెంచుకుంటూ పోయారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారన్నారు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో సరసమైన ధరలలో నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించడం జరుగుతుందన్నారు.
Also Read: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్‌ల పాత్ర.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.!
ప్రభుత్వ ఆదేశానుసారం మార్కెట్ యార్డ్ నుండి విక్రయాలను ప్రారంభించామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కౌంటర్ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని రావాలని, ఒక్కొక్కరికి కేజీ కందిపప్పు, ఐదు కేజీల బియ్యం ఇస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.