Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎమ్మెల్యే అక్బరుద్దీన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశం డిసెంబర్ 9వ తేదీన జరుగనుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎమ్మెల్యే అక్బరుద్దీన్

Protem Speaker Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ సమావేశం డిసెంబర్ 9వ తేదీన జరుగనుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిచేతో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ప్రొటెం స్పీకర్ ఎవరా? అనే సందిగ్ధం నెలకొనగా.. దానిపై క్లారిటీ ఇచ్చింది. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) వ్యవహరించనున్నట్లు సమాచారం.

తొలి క్యాబినెట్ మీటింగ్ అనంతరం.. డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar babu) ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజున అసెంబ్లీల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, కొత్త సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత కొత్త స్పీకర్‌ను ఎన్నుకొంటారు. ఇప్పటికే స్పీకర్ అభ్యర్థి పేరు ఖరారైంది. గడ్డం ప్రసాద్ కుమార్‌ను (Gaddam Prasad Kumar) స్పీకర్‌గా ప్రకటించింది కాంగ్రెస్. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రొటెం స్పీకర్ ఎవరు? అనే అంశంపై చర్చ జరిగింది. చివరికి ఈ ప్రొటెం స్పీకర్‌పైనా క్లారిటీ వచ్చింది.

వాస్తవానికి ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేలను నియమిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే.. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తరువాతి స్థానంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ కూడా ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు.

ప్రొటెం స్పీకర్‌గా కేసీఆర్‌ ఛాన్సే లేదు!

వాస్తవానికి డిసెంబర్ 9న అంటే శనివారమే అసెంబ్లీ సమావేశం జరుగనుంది. శాసనసభ సభ్యులందరూ సభా వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు కేసీఆర్ కాలు జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన అసెంబ్లీకి హాజరవడం కష్టమనే చెప్పాలి. సీనియార్టీ లిస్ట్‌లో కేసీఆర్ తరువాతి స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందని అంతా భావించారు. ఇప్పటికే ఆయనకు స్పీకర్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. దాదాపు ఈయనే ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందనుకున్నారు. కానీ, చివరి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నిర్ణయించారు.

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు