Mizoram Results: మిజోరాం ముఖ్యమంత్రి ఓటమి.. జెడ్పీఎం మాసివ్ విక్టరీ.. 

మిజోరాం ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అంటే జెడ్పీఎం ఘన విజయం సాధించింది. జెడ్పీఎం గాలిలో ప్రస్తుత మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా ఓటమి పాలయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధినేత లల్దుహోమా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

New Update
Mizoram Results: మిజోరాం ముఖ్యమంత్రి ఓటమి.. జెడ్పీఎం మాసివ్ విక్టరీ.. 

Mizoram Results: మిజోరాంలోని 40 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి కొత్త పార్టీ జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) 27 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)కి 10, బీజేపీకి 2, కాంగ్రెస్‌కు ఒక సీట్లు వచ్చాయి.

మిజోరంలో అతిపెద్ద ఉత్కంఠ ఐజ్వాల్ ఈస్ట్-1 సీటులో చోటు చేసుకుంది. ఇక్కడ ముఖ్యమంత్రి జోరంతంగా ఎన్నికల్లో ఓడిపోయారు. జెడ్పీఎం అభ్యర్థి లల్తన్‌సంగ చేతిలో 2 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత ఆయన రాజీనామా చేశారు.

Mizoram Results: ZPM విజయంపై, పార్టీ నాయకుడు - ముఖ్యమంత్రి పోటీదారు లల్దుహోమా మాట్లాడుతూ - పార్టీ విజయంతో తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. తాను  ఇలాంటి ఫలితాలను ఆశించాననీ అన్నారు.  మరో రెండు రోజుల్లో గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు.  ఈ నెలలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారు. గతంలో  లాల్దుహోమా ఇందిరా గాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా.. కాంగ్రెస్ ఎంపీగా వ్యవహరించారు. 

Also Read: మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!!

ఆరు పార్టీల కూటమితో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్.. 

మొదట్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ(Mizoram Results) ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్‌మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్-మిజోరం పీపుల్స్ పార్టీ ఉన్నాయి. 2018లో ఇదే కూటమితో జెడ్పీఎం ఎన్నికల్లో పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. దీని తరువాత, ఎన్నికల సంఘం (ECI) జూలై 2019లో పార్టీని అధికారికంగా నమోదు చేసింది. అతిపెద్ద వ్యవస్థాపక పార్టీ, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, 2019లో కూటమి నుంచి వైదొలిగింది. తరువాత  మిగిలిన ఐదు పార్టీలు ZPM పేరుతో ఒకదానిలో విలీనం అయ్యాయి. 

జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకుడు లల్దుహోమా ఎవరు?

లాల్దుహోమా మాజీ IPS అధికారి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతను నిర్వహించారు. రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తరుణంలో లాల్దుహోమ మరోసారి వెలుగులోకి వచ్చారు. 

Mizoram Results: వాస్తవానికి 1984లో మిజోరాం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై లల్దుహోమా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో విభేదాలు రావడంతో అనర్హత వేటు పడింది. 1988లో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన తొలి లోక్‌సభ ఎంపీగా గుర్తింపు పొందారు. 2018లో, లాల్దుహోమా ఐజ్వాల్ వెస్ట్-I - సెర్చిప్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు