IPL AUCTION 2024: ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర.. రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా స్టార్! ఐపీఎల్ మినీ ఆక్షన్ రికార్డులు బద్దలవుతున్నాయి. అత్యధిక ధరల రికార్డును ఇప్పటికే పాట్ కమిన్స్ బ్రేక్ చేయగా.. అతని రికార్డును ఆస్ట్రేలియా పేపర్ మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. By Trinath 19 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఐపీఎల్ మినీ ఆక్షన్ రికార్డులు బద్దలవుతున్నాయి. ధరల రికార్డను ఇప్పటికే పాట్ కమిన్స్ బ్రేక్ చేయగా.. అతని రికార్డును ఆస్ట్రేలియా పేపర్ మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను అధిగమించాడు, అతను అంతకుముందు రోజు SRH ద్వారా రూ. 20.5 కోట్లకు సంతకం చేశాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా టోర్నీని ఉపయోగించాలని స్టార్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని బేస్ ధర రూ.2 కోట్లు. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కెప్టెన్లు స్టార్క్ కోసం వేలంపాటను ప్రారంభించారు. రిషబ్ పంత్ ఢిల్లీ టేబుల్ వద్ద స్కార్క్ కోసం వేలం పాడాడు. 9.6 కోట్ల వద్ద ఢిల్లీ డ్రాప్ అయ్యింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగింది. ఆ తర్వాత ముంబై 9.8 కోట్లతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత జరిగిని సీన్స్ అక్కడున్నవారిని షాక్‌కు గురి చేసింది.. గుజరాత్, కోల్‌కతా రెండు జట్లు స్టార్క్ కోసం తీవ్రమైన బిడ్డింగ్ వేశాయి. అసలు వెనుక్కి తగ్గలేదు. చివరకు స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కేకేఈర్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కప్ గెలవడంతో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. బంతిని అధిక వేగంతో స్వింగ్ చేయగలగడం స్టార్క్ సామర్థ్యం. స్టార్క్ చివరిసారిగా 2015లో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున తన ప్రారంభ సీజన్ ఆడాడు. ఆ సంవత్సరం 13 గేమ్‌లలో 20 వికెట్లు తీశాడు, సగటు 14.55, ఎకానమీ రేటు 6.76. Also Read: కళ్లు చెదిరే రికార్డు ధర..రూ.20.5 కోట్లకు పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన SRH! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి