Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కోసం అనేక రకాల పూజలు చేస్తుంటారు. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఇళ్లంతా బాగా అలంకరిస్తారు. మామూలుగా అయితే లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ గడపకు పసుపురాసి పూలతో అలంకరిస్తారు. దేవుడి గుడిని అలంకరించి పూజలు చేస్తారు. అయితే చాలా మంది శుక్రవారం డబ్బులను ఎవరికీ ఇవ్వరు. ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు. చాలా మంది ఉపవాసాలతో పాటు నియమాలు పాటిస్తారు.
అయితే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో విష్ణుమూర్తి వివరించారు. భగవంతుడిని దూషించేవారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. శంఖం సౌండ్ వినిపించని ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉండటర. అలాగే తులసిమొక్కని పూజించని నివాసంలో లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టపడరని అంటున్నారు. అంతేకాకుండా ఇంటికి గెస్ట్‌లు ఎవరైనా వస్తే భోజనం పెట్టకపోతే కూడా ఉండరట.
ఇంట్లో పూజలు చేయకపోయినా, ఎప్పుడూ ఏమీ లేదని బాధపడేవారి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి ఉండదు. శుక్రవారం ఇంట్లో బూజు దులపడం కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో భార్య ఎప్పుడూ ఏడుస్తున్నా లక్ష్మీదేవి ఆ ఇంటి ముఖం చూడదు. చెట్లను నరకడం, సూర్యోదయం సమయంలో భోజనం చేసినా ఆ ఇంటికి లక్ష్మి రాదు. తడి కాళ్లతో నిద్రపోయినా లక్ష్మీదేవి ఆ గడప తొక్కదని పండితులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.