వరదల్లో బురద రాజకీయాలు... పీక్స్ కు చేరిన పోస్టర్ వార్...!

తెలంగాణలో వరద రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల మధ్య ‘వాంటెడ్’ పోస్టర్ల వార్ నడుస్తోంది. కొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాయి. మరికొన్ని చోట్ల సీఎం కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

వరదల్లో బురద రాజకీయాలు... పీక్స్ కు చేరిన పోస్టర్ వార్...!
New Update

తెలంగాణలో వరద రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల మధ్య ‘వాంటెడ్’ పోస్టర్ల వార్ నడుస్తోంది. పలానా పార్టీ ఎంపీ కనిపించడం లేదని ఒక చోట పోస్టర్లు వేస్తే అసలు సీఎం కనిపించడం లేదని మరో చోట దర్శనమిస్తున్నాయి. దీంతో పార్టీలన్నీ వరద్దలో బురద రాజకీయాలు చేస్తున్నాయంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. అసలు ఏం జరుగుతోందంటే....

రాష్ట్రంలో మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగి పోయాయి. ఇలాంటి ఆపద కాలంలో జనాలను ఆదుకోవాల్సిన అధికార పక్ష నేతలు అటువైపే చూడటం లేదని ప్రతిపక్షాలు కన్నెర్ర జేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయం మందుకు ధర్నాకు దిగింది.

publive-image

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ మల్కాజ్ గిరిలో పోస్టర్లు వెలిశాయి. గతంలో మల్కాజ్ గిరిలో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాయం అయ్యారని, ఈ సారైనా వస్తారా అన్న కోణంలో పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇదంతా అధికార బీఆర్ఎస్ నేతల పనే అంటూ నిప్పులు చెరిగాయి.

ఆ కొద్ది సేపటికే సీఎం కేసీఆర్ కనుబటుట లేదంటూ పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లు ఫోటో తీసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అగ్నికి వాయువు తోడైనట్టు ఇందులో బీజేపీ కూడా వచ్చి చేరింది. కేసీఆర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. దీంతో తెలంగాణలో వదర రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe