/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-20-4-jpg.webp)
Miss World 2024: 71 మిస్ వరల్డ్ 2024 పోటీలు భారత్ వేదికగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ పోటీలు రేపటితో ముగియనున్నాయి. ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ 2024 కాంపిటీషన్స్ లో 120 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటున్నారు. భారతదేశం నుంచి ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తుంది. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీలు చివరి దశకు వచ్చేశాయి. మరి కొన్ని గంటల్లో మిస్ వరల్డ్ 2024 విజేత ఎవరో తేలనుంది.
ఇప్పటికే పలు రౌండ్స్ పూర్తయిన ప్రపంచ సుందరి పోటీల్లో.. భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ శెట్టి ఏయే అవార్డులు దక్కించుకుందో ఇప్పుడు తెలుసుకుందాము..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/417573833_18292592524082548_6123954957087642559_n-jpg.webp)
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనడానికి దాదాపు రెండేళ్ల నుంచి ప్రిపేర్ అయిన సినీ.. ఇప్పటికే జరిగిన పలు ఛాలెంజ్ రౌండ్స్ సత్తా చాటింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/417696233_18292592545082548_7266049256991697992_n-jpg.webp)
'హెడ్ టూ హెడ్ ఛాలెంజ్' లో టాప్ 25, 'టాలెంట్ రౌండ్' లో టాప్ 14, 'టాప్ మోడల్ ఛాలెంజ్' రౌండ్ లో టాప్ 20 గా నిలిచిన సినీ.. మిస్ వరల్డ్ టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/419541360_18292592536082548_3114145991434855649_n-jpg.webp)
టాలెంట్ రౌండ్ లో భాగంగా సినీ.. మాజీ ఐశ్వర్య రాయి సూపర్ హిట్ పాటలకు డాన్స్ వేసి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. “నింబూడా”, “తాల్ సే తాల్ మిలా” బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని “కజ్రా రే” పాటలకు సాంప్రదాయ వస్త్రాలంకారణలో నృత్య ప్రదర్శన చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సినీ.. అసమానమైన, అద్భుతమైన మిస్ వరల్డ్ 1994 ఐశ్వర్య రాయి పాటలను నా టాలెంట్ రౌండ్ లో ప్రదర్శించడం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/417538492_18292360651082548_5875292573909393347_n-jpg.webp)
టాప్ మోడల్ ఛాలెంజ్ రౌండ్ లో బ్లాక్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసిన సినీ.. బెస్ట్ డిజైనర్ డ్రెస్ ఫర్మ్ ఆసియా అండ్ ఓషియానగా విజయాన్ని అందుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/417502856_18292360660082548_1645727757626992338_n-jpg.webp)
రేపటితో మిస్ వరల్డ్ 2024 పోటీలు ముగియనున్నాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి పోటీ పడుతున్న సినీ శెట్టి ప్రపంచ సుందరి కిరీటం గెలవాలని ఆశిద్దాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/417503952_18292360669082548_2019275633022075109_n-jpg.webp)
Also Read: NBK109 Glimpse : బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే
Follow Us