మిస్ యూనివర్స్ ఫస్ట్ రన్నరప్ హాట్ కామెంట్స్ వైరల్.! మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో ఫస్ట్ రన్నరప్ ఆంటోనియా పోర్సిల్డ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఒక ఏడాది వేరొక మహిళగా ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జి ప్రశ్నించారు. అందుకు ఆమె తాను పాక్‌కి చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. By Jyoshna Sappogula 20 Nov 2023 in సినిమా ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Miss Universe: 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అందుకు తగ్గట్టుగానే బ్యూటీ క్వీన్స్ తమదైన శైలిలో ఆన్సర్స్ చెప్పి జడ్జిలను ఇంప్రెస్ చేసి కీరిటాన్ని దక్కించుకున్నారు. అయితే, ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించారు. Also read: గెలిచామన్న గర్వం నెత్తికెక్కింది..మిచెల్ మార్షల్ అనుచిత ప్రవర్తన అందుకు పోర్సిల్డ్ ఏం చెప్పిందంటే తాను పాక్‌కి చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, ఆమె మలాలా గురించి వివరిస్తూ చెప్పిన సమాధానం అందరిని ఆలోచింప జేసింది. మలాలా మహిళల విద్యకోసం పోరాడిందని.. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి ఎన్ని కష్టాలు ఫేస్ చేసిందో మనకు తెలుసని.. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్తే ఆమెను సెలక్ట్ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. FINAL Q&A starting with Thailand! @porxild#72ndMISSUNIVERSE #MissUniverse2023 @TheRokuChannel pic.twitter.com/w71IH4kEvY — Miss Universe (@MissUniverse) November 19, 2023 థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చెప్పిన సమాధానం అందర్నీ ఇంప్రెస్ చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వావ్..భలే చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే, ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ పోర్సిల్డ్ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్ మోరయా విల్సన్ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది. కాగా సెంట్రల్ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించారు. #miss-universe-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి