/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/anu-jpg.webp)
Anushka Shetty: హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(miss shetty mr polishetty). నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty) హీరోగా నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా అనుష్క కనిపించలేదు. ఆమె వస్తుంది, వస్తుంది అంటూ ప్రచారం జరిగేలోపే సినిమా రిలీజ్ అవ్వడం, ఫస్ట్ వీకెండ్ పూర్తవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఇంతకీ అనుష్క ప్రేక్షకులముందుకొస్తుందా? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఆమె ప్రచారం చేస్తుందా? అసలు ఈ టైమ్ లో అనుష్క ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకడం కంటే ముందు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించి అనుష్కపై ఓ ఇంటర్వ్యూ షూట్ చేశారు.
ఆ ఇంటర్వ్యూ ఎడిటింగ్ కూడా పూర్తయింది. ఇక రేపోమాపో రిలీజ్ చేద్దాం అనుకున్న టైమ్ లో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఈ గ్యాప్ లో కొన్ని మీడియా సంస్థలకు ఫోన్ ఇంటర్వ్యూలు ఇచ్చింది అనుష్క. అలా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రచారం ముగిసింది. అనుష్క బయటకు రాకుండానే సినిమా తెరపైకొచ్చింది. అనుష్క ప్రస్తుతం ఎలా ఉందనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.ఇక ఇంతకుముందు చెప్పుకున్న ప్రశ్నల విషయానికొస్తే.. అనుష్క త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అది తెలుగు సినిమాతో కాదు, ఓ మలయాళం సినిమాతో ఆమె రాబోతోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఆమె ఇక ప్రచారం చేయకపోవచ్చు. మరో తెలుగు సినిమాకు కూడా ఆమె కాల్షీట్లు కేటాయించినప్పటికీ, అది సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పడుతుంది.
Also Read: ట్రేడ్ టాక్.. ఈ వారం మార్కెట్ పరిస్థితేంటి?