జొమాటో డెలివరీ గర్ల్ గా మిస్‌ మధ్యప్రదశ్‌..!!

మధ్యప్రదేశ్ లో బ్యూటిఫుల్ యంగ్ లేడి పల్లవి చౌదరి స్పోర్ట్స్‌ బైక్ పై జొమాటో బ్యాగ్ ని తగిలించుకుని రయ్ మంటూ ఇండోర్ రోడ్డుపై హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్స్‌ పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. మిస్‌ మధ్యప్రదేశ్ అవార్డ్ ను సొంత చేసుకున్న పల్లవి.. జొమాటోని మార్కెటింగ్ చేస్తోందని కామెంట్స్‌ చేయగా.. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. ఇది మా బ్రాండ్‌లో కేవలం 'ఫ్రీ-రైడింగ్' చేసిన వ్యక్తిలా కనిపిస్తోందని వెల్లడించారు.

New Update
జొమాటో డెలివరీ గర్ల్ గా మిస్‌ మధ్యప్రదశ్‌..!!

pallavi choudhary: మధ్యప్రదేశ్ లో  బ్యూటిఫుల్ యంగ్ లేడి పల్లవి చౌదరి స్పోర్ట్స్‌ బైక్ పై ఎక్కి జొమాటో బ్యాగ్ ని తగిలించుకుంది. షార్ట్ వేసుకుని రయ్ రయ్ మంటూ ఇండోర్ రోడ్డుపై దూసుకువెళ్తోంది. అయితే, సిగ్నల్ పడడంతో అందరి చూపు ఆమెపై మళ్లింది. ఇంకేముంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత అందమైన అమ్మాయి డెలివరి చేయడంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

డెలివరి చేస్తూ ఇండోర్‌ లో హల్ చల్ సృష్టించిన  ఈ యువతి అసలు పేరు పల్లవి చౌదరి. ఆర్కిటెక్చర్ చదివింది. ఆ వృత్తితో పాటు మోడలింగ్ కూడా చేస్తోంది. అంతే కాదు, ఈ అందమైన అమ్మాయి ఇప్పటికే మిస్‌ స్టైల్ బెంగళూరు కిరీటాన్ని.. మిస్‌ మధ్యప్రదశ్‌ అవార్డ్ ను కూడా సొంత చేసుకుంది.అయితే, ఏవరేమనుకుంటే నాకేంటని పల్లవి చౌదరి డేర్ అండ్ డ్యాషింగ్ గా డెలివరి బ్యాగ్ తగిలించుకుని స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లడంతో పలువురు శభాష్ అంటున్నారు. మరి కొందరు జొమాటోని మార్కెటింగ్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, ఈ వీడియోపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియాలో స్పందించారు. జొమాటో కంపెనీకి, ఈ మహిళకు ఏ సంబంధం లేదని అన్నారు. ఒక వినియోగదారు 'X'లో వీడియోను పోస్ట్ చేస్తూ..“ఇండోర్ #Zomato మార్కెటింగ్ హెడ్‌కి ఈ ఆలోచన వచ్చినట్లు ఉందని.. అతను ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ఖాళీ జొమాటో బ్యాగ్‌తో తిరిగేందుకు ఒక మోడల్‌ను నియమించుకున్నట్లున్నారు అని పోస్ట్ చేశాడని..అయితే, ఈ వీడియోతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.

మేము హెల్మెట్ లేని బైకింగ్‌ను ఆమోదించమని తేల్చి చెప్పారు. అలాగే, మాకు ఇండోర్ మార్కెటింగ్ హెడ్ కూడా లేరని అతడికి రిప్లై ఇచ్చారు. ఇది మా బ్రాండ్‌లో కేవలం 'ఫ్రీ-రైడింగ్' చేసిన వ్యక్తిలా కనిపిస్తోందని వెల్లడించారు. మహిళలు ఫుడ్ డెలివరీ చేయడంలో తప్పు లేదని..జీవనోపాధి కోసం ప్రతిరోజూ వందలాది మంది మహిళలు డెలివరీ ఏజెంట్లుగా ఉన్నారని తెలిపారు. వారి పని నీతి గురించి మేము గర్విస్తున్నామని వివరించారు. అయితే, పల్లవి చౌదరి ఎందుకు ఇలా చేసిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం 1.8 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది.

Also read: రీతూ వర్మపై నెట్టింట్లో హల్ చల్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు