Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం లో అపచారం జరిగింది. ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు అయ్యాడు.ఈ విషయాన్ని గమనించిన భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆ ఉద్యోగిని పట్టుకుని దేహశుద్ది చేశారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో క్యూ కంపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉద్యోగికి దేహశుద్ధి చేసిన అనంతరం భక్తులు ఆలయ క్యూ లైన్లలో కూర్చుని నిరసన తెలిపారు. ఆ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..!
ఆందోళన పై సమాచారం అందుకున్న సహాయ కార్య నిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మద్యం తాగి విధులకు వస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ఈ ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు.