AP: శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఉద్యోగిని చితక్కొట్టిన భక్తులు..! శ్రీశైలం ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. క్యూలైన్ ఉద్యోగి మద్యం సేవించి విధుల్లో పాల్గొనడంతో గమనించిన భక్తులు అతడిని చితకబాదారు. అనంతరం ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం లో అపచారం జరిగింది. ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు అయ్యాడు.ఈ విషయాన్ని గమనించిన భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆ ఉద్యోగిని పట్టుకుని దేహశుద్ది చేశారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో క్యూ కంపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉద్యోగికి దేహశుద్ధి చేసిన అనంతరం భక్తులు ఆలయ క్యూ లైన్లలో కూర్చుని నిరసన తెలిపారు. ఆ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Also Read: తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..! ఆందోళన పై సమాచారం అందుకున్న సహాయ కార్య నిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మద్యం తాగి విధులకు వస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ఈ ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు. https://rtvlive.com/wp-content/uploads/2024/08/srisailam.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/knl-2-1.jpg"> #srisailam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి