Telangana Results: బీఆర్‌ఎస్‌ ఓటమిపై కేటీఆర్, హరీష్‌ రావు, కవిత ఏమన్నారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమిపై ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత స్పందించారు. ఫలితాలపై ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

New Update
Telangana Results: బీఆర్‌ఎస్‌ ఓటమిపై కేటీఆర్, హరీష్‌ రావు, కవిత ఏమన్నారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమిపై ఆ పార్టీ నేతలు స్పందించారు. మంత్రి కేటీఆర్, హరీష్‌ రావు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 'బీఆర్‌ఎస్‌కు వరుసగా రెండుసార్లు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన ఫలితంపై నాకు బాధగా లేదు. కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందాను. ఈ ఎన్నికలను ఓ పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు' అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలని మంత్రి హరీష్ రావు అన్నారు. 'రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలని' తెలిపారు.

Also Read: మోదీ మేనియా.. బీసీ కార్డు కూడా పనిచేయలేదు.. బీజేపీ పరాభవానికి కారణాలివే!

అలాగే ప్రియమైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులురా.. మీ హార్ట్‌వర్క్‌కు ధన్యవాదాలని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. తమ కోసం పోరాడిన సోషల్ మీడియా వారియర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము తెలంగాణకు సేవకులమే. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు' అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు