లోకేష్ పప్పు ..పవన్ ఉప్పు.. సమాజానికి ముప్పు..మంత్రి షాకింగ్ కామెంట్స్.!

నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లపై మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. "లోకేష్ పప్పు ..పవన్ ఉప్పు..సమాజానికి ముప్పు" అని సెటైర్ వేశారు. పప్పులో ఉప్పు ఎక్కువైతే సమాజానికి చేటని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బీసీల ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు.

New Update
లోకేష్ పప్పు ..పవన్ ఉప్పు.. సమాజానికి ముప్పు..మంత్రి షాకింగ్ కామెంట్స్.!

Minister Venugopala Krishna : అంబేద్కర్ కోనసీమ జిల్లా..రామచంద్రాపురంలో భారతదేశం రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు మంత్రి వేణుగోపాలకృష్ణ. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదల జీవన ప్రమాణం పెంచడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడంతోపాటు భద్రత, భరోసా పెంపొందించుటమే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ జయమని మంత్రి వ్యాఖ్యనించారు.

Also read: బుక్కపట్నం SRO శ్రీనివాస్ ది ఆత్మ’హత్యే’ నా ?

కాగా, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేష్ ఒక పప్పు .. పవన్ ఒక ఉప్పు వీరు సమాజానికి ముప్పు అని కౌంటర్ వేశారు. పప్పులో ఉప్పు ఎక్కువైతే సమాజానికి చేటని దుయ్యబట్టారు.నైతిక విలువలు లేకుండా తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు నాయుడుతో పాటు పలు పత్రికలు దురుద్దేశం పూరకమైన ఆలోచనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Also Read: పార్టీ మారే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.!

ముఖ్యంగా బీసీ వర్గాలు కులగననకు స్వాగతిస్తున్నారన్నారు. కులగన అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చారిత్రాత్మకమైన నిర్ణయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాల రద్దుకే కులగనన అంటున్న ప్రతిపక్షాల వాదనలపై మంత్రి ఫైర్ అయ్యారు. బీసీల ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. జన్మభూమి కమిటీ పేరుతో అప్పటి ప్రభుత్వం లంచాలు తిన్న వైనం అని ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు