Uttam Kumar Reddy: ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది: మంత్రి ఉత్తమ్‌

TG: ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని అన్నారు మంత్రి ఉత్తమ్. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Uttam Kumar : అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

Minister Uttam Kumar Reddy: బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని అన్నారు. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ చెప్పిందని.. కానీ 10 ఏళ్ల పాలనలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

ALSO READ: సీఎం రేవంత్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్లసాగు చట్టాలను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని ఫైర్ అయ్యారు. కొన్ని నెలల పాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక.. సాగుచట్టాలు రద్దు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయలేదని విమర్శించారు. బీజేపీ తెచ్చిన అగ్నివీర్‌ పథకం దేశ రక్షణకు ప్రమాదకరం అని హెచ్చరించారు. గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా దిగజారి మాట్లాడలేదని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు