Taneti Vanitha: విజయవాడలో సీఎం జగన్ పై దాడి అమానుషమన్నారు హోం మంత్రి తానేటి వనిత. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. పార్టీలన్నీ కలిసినా సీఎం జగన్ ను ఏమీ చేయలేక ఇలా భౌతిక దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో: కేఏ పాల్
ఇది ఎవరో ఆకతాయిలు చేసింది కాదని.. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. దాడులు చేయడమే కాకుండా తిరిగి మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సానుభూతి కోసం గతంలో అలిపిరిలో దాడి చేయించుకొని అందరూ అలా చేస్తారని అనుకుంటే ఎలా? అని అన్నారు. మా జగనన్న దమ్మున్న నాయకుడు కాబట్టి అంతలా దాడి జరిగినా ధైర్యంగా నిలబడ్డాడన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. కారకులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Taneti Vanitha: అందుకే జగన్ పై దాడి చేశారు: తానేటి వనిత
జగన్ కు ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా భౌతిక దాడికి తెగబడ్డారన్నారు మంత్రి తానేటి వనిత. ఇది ఎవరో ఆకతాయిలు చేసింది కాదని.. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. కారకులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.