Sridhar Babu: పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైంది: మంత్రి శ్రీధర్‌బాబు TG: నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్రం స్పందించాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని మండిపడ్డారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 20 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Sridhar Babu: నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్రం స్పందించాలని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 63 మందికి ఒకటే ర్యాంకు వచ్చిందని.. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని మండిపడ్డారు. సుప్రీం కోర్టు సీరియస్.. నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంపై సుప్రీంకోర్టు మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్ష నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా ఇందుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంకా పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది. లీకేజ్ ఆరోపణలపై 2వారాల్లో జవాబు చెప్పాలని తెలిపింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సుప్రీంకోర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సమస్యలు పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. నీట్ పరీక్షల్లో (NEET Exams) అవకతవకలు జరిగాయని పేపర్ లీక్ అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పేపర్ ఎక్కడా లీక్ కాలేదని స్పష్టం చేశారు. #minister-sridhar-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి