Vizianagaram: మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అవమానంపై ఓ విద్యార్థి తండ్రి మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారుల తీరును తప్పుబట్టారు.
Also Read: ఈ నిబంధనలు పాటించాల్సిందే.. పాఠశాలలకు మంత్రి హెచ్చరిక..!
పాఠశాల కమిటీ ఎన్నికల్లో ఓ విద్యార్థి తండ్రిని చొక్కా విప్పి అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్‌లో ఇటీవల పాఠశాల కమిటీ ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ సమయంలో ఓ విద్యార్థి తండ్రిపై టీచర్లు ప్రవర్తించిన తీరును మంత్రి ఖండించారు.
Also Read: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..!
పసుపు చొక్కా వేసుకున్నారన్న సాకుతో ఓ గిరిజనుడిని 2 గంటల పాటు నగ్నంగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై విద్యాశాఖ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డీఈవోను ఆదేశించారు. ఈ ఘటనకు సహకరించిన సంబంధిత హోంగార్డు, స్కూల్ హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.