AP: విద్యార్థి తండ్రిని నగ్నంగా నిలబెట్టిన అధికారులు.. మంత్రి సీరియస్..! మన్యం జిల్లాలో ఓ విద్యార్థి తండ్రిని టీచర్లు అవమానించిన ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కమిటీ ఎన్నికల సమయంలో పసుపు చొక్కా వేసుకున్నారన్న సాకుతో గిరిజనుడిని నగ్నంగా నిలబెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. By Jyoshna Sappogula 13 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Vizianagaram: మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అవమానంపై ఓ విద్యార్థి తండ్రి మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారుల తీరును తప్పుబట్టారు. Also Read: ఈ నిబంధనలు పాటించాల్సిందే.. పాఠశాలలకు మంత్రి హెచ్చరిక..! పాఠశాల కమిటీ ఎన్నికల్లో ఓ విద్యార్థి తండ్రిని చొక్కా విప్పి అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్‌లో ఇటీవల పాఠశాల కమిటీ ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ సమయంలో ఓ విద్యార్థి తండ్రిపై టీచర్లు ప్రవర్తించిన తీరును మంత్రి ఖండించారు. Also Read: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..! పసుపు చొక్కా వేసుకున్నారన్న సాకుతో ఓ గిరిజనుడిని 2 గంటల పాటు నగ్నంగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై విద్యాశాఖ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డీఈవోను ఆదేశించారు. ఈ ఘటనకు సహకరించిన సంబంధిత హోంగార్డు, స్కూల్ హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. #sandhya-rani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి