మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. ప్రేమ జంట సంచలన వ్యాఖ్యలు.!

మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా మంత్రి రోజా ఒత్తిడి చేస్తున్నారని యువతి చెబుతోంది. డీజీపీ స్పందించి తమకు రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది.

New Update
మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. ప్రేమ జంట సంచలన వ్యాఖ్యలు.!

ROJA : సాధారణంగా ఏదైన సమస్య వస్తే ప్రజలు  పోలీసులను ఆశ్రయిస్తారు. అక్కడ పని జరగకపోతే తెలిసిన ఎమ్మెల్యేనో, లేదంటే మంత్రినో ఆశ్రయిస్తారు. కానీ, ఏకంగా మంత్రి నుంచే తమకు సమస్య ఉందని ఓ ప్రేమ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంత్రి రోజా నుంచి తమకు రక్షణ కావాలని వేడుకోంటోంది. అసలేం జరిగిందో మీరే తెలుసుకోండి.

Also Read: ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!

తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరు జిల్లాకు చెందిన జిలానీ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరే అయినా.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, ఇంట్లో వాళ్లు మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా యువతి ప్రవీణ తల్లిదండ్రులు అంగీకరించలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక యువతి ఇంటి నుంచి పారిపోయింది. ప్రియుడిని కలిసింది. ఇద్దరూ మేజర్లు కావడంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

అదే సమయంలో తన కుమార్తెను జిలాని కిడ్నాప్ చేశాడని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా మంత్రి రోజాను ఆశ్రయించాడు. అయితే మంత్రి రోజా ఆ ప్రేమ జంట ఎక్కడ ఉన్న వారికి అప్పగించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రేమ జంట ఆరోపిస్తోంది. మరోవైపు, అటు నెల్లూరులోనూ ప్రియుడు జిలానీపై పోలీసులకు కంప్లైట్ ఇచ్చారని యువతి వాపోతోంది.

Also Read: కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.!

ఇక మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ప్రేమ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా మంత్రి రోజా ఒత్తిడి చేస్తున్నారని యువతి చెబుతోంది. తమకు ఏమైనా జరిగితే మంత్రి రోజాదే బాధ్యత అంటోంది. డీజీపీ స్పందించి తమకు రక్షణ కల్పించాలంటూ ఈ ప్రేమ జంట విజ్ఞప్తి చేస్తోంది. మా బతుకు మమ్మల్ని బతికనివ్వండి..ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నారని.. ఇలాగే వేధిస్తే.. సూసైడ్ చేసుకుంటాం అంటూ వ్యాఖ్యానించింది.

Advertisment
తాజా కథనాలు