Andhra Pradesh: బాలకృష్ణా.. నీ ఫ్లూటు అక్కడ ఊదు.. మంత్రి రోజా మాస్ వార్నింగ్..

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి రోజా మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రి రోజా.. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై సీరియస్‌గా స్పందించారు.

New Update
Andhra Pradesh: బాలకృష్ణా.. నీ ఫ్లూటు అక్కడ ఊదు.. మంత్రి రోజా మాస్ వార్నింగ్..

Minister Roja Warning to Balakrishna: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(MLA Balakrishna) మంత్రి రోజా(Minister Roja) మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రి రోజా.. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై సీరియస్‌గా స్పందించారు. మీ బావ చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే మీసం మెలేశారా అని సెటైర్లు వేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. జగన్ ముందు కాదంటూ బాలకృష్ణకు రోజా వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన బావ చంద్రబాబు కోసం బాలకృష్ణ అసెంబ్లీలో హడావిడి చేస్తున్నాడని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ.. అసెంబ్లీకి ఎన్ని సార్లు వచ్చారని ప్రశ్నించారు. 'షూటింగ్‌లో అమ్మాయిలకు ముద్దు పెట్టాలి.. కడుపు చేయాలని చెప్పే బాలకృష్ణ.. అసెంబ్లీకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.' అంటూ నిప్పులు చెరిగారు. సభలో తాము 151 మంది ఉన్నామని, టీడీపీ వారు 23 మందే ఉన్నారని పేర్కొన్న మంత్రి రోజా.. తాము కూడా వారిలా చేస్తు సభలో ఉండగలరా? అని ప్రశ్నించారు.

శాసనసభలో టీడీపీ సభ్యులు తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మంత్రి రోజా. చంద్రబాబు దోపిడీ దొంగ అనే విషయం అందరికి అర్థం అయిందన్నారు. చంద్రబాబు స్కామ్ చేయలేదని ఎదోరకంగా చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును చూస్తే సిగ్గేస్తుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు.. 10రోజుల విచారణ జరిపిన రోజు టీడీపీ వాళ్ళు, బాలకృష్ణ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు మంత్రి రోజా.

స్పీకర్ వార్నింగ్.. ముగ్గురు సభ్యుల సస్పెన్షన్..

ఇదిలాఉంటే.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రవర్తనను తప్పుపడుతూ తీవ్రంగా మందించారు. మొదటి తప్పుగా భావించి హెచ్చరించి వదలేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇకపోతే.. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవులను అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.

మంత్రి రోజా బాలకృష్ణకు ఎలా వార్నింగ్ ఇస్తున్నారో చూడండి..

Also Read:

Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.

AP Assembly Live🔴 Updates: ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. కొటం రెడ్డిని బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్..

Advertisment
తాజా కథనాలు