Roja: ముష్టిం 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్..: మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్, పవన్ కల్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని.. కానీ జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు.

New Update
Roja: ముష్టిం 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్..: మంత్రి రోజా

Minister RK Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఫ్రస్టేషన్ పీక్స్ చేరిందని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత సీఎం జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారన్నారు. జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని మంత్రి రోజా ప్రశ్నించారు. ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారని రోజా కామెంట్స్ చేశారు.

Also Read: ఫ్లవర్ రోజా..ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు: రవినాయుడు

ప్రజలకు తమరు ఏం చేయబోతున్నారనేది ముందు చెప్పాలని సూచించారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం చేశావనేదే ప్రజలు గమనిస్తారన్నారు. జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

Also Read: దమ్ముంటే జగన్ సమాచారం బయటపెట్టు..పవన్ కు పేర్నినాని సవాల్

ఓ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి.. కేవలం 24 సీట్లకే పరిమితం కావడం సిగ్గు చేటని విమర్శిలు గుప్పించారు. ఇప్పటి వరకూ జనసేన బూత్, మండల కమిటీల నిర్మాణ పనులు చేయలేదని వ్యాఖ్యానించారు. ముష్టిం 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కాళ్ల వద్ద పని చేస్తూ జనసైనికులను తాకట్టు పెడుతున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు