Ponnam Prabhakar: స్థానిక ఎన్నికలకు బ్రేక్.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఈ రోజు జరిగిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పొన్నం మాట్లాడుతూ.. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. కులగణనపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు.

New Update
Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar: హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు భవిష్యత్‌ తరాలకు తెలియాలన్నారు. ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పాపన్న గౌడ్‌ పర్యాటక కేంద్రానికి రూ.4.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించామన్నారు. సర్వాయి పాపన్న జీవితం మనందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సర్వాయిపేట కోటను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పొన్నం చేసిన వ్యాఖ్యలతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు